పాకిస్థాన్ కి గూఢచర్యం చేసిన భారత సైనికుడు 

పాకిస్థాన్ కి గూఢచర్యం చేసిన భారత సైనికుడు

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : పాకిస్తాన్ కి రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్న భారత సైనికుడిని ఆర్మీ పట్టుకుంది. ‘చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న అలీం ఖాన్ అనే సైనికుడు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీకి సమాచారాన్ని చేరవేస్తున్నారని గుర్తించాం. దీనిపై కోర్టులో విచారణ రెండు, మూడు రోజుల్లో మొదలవుతుంది’ అని ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ఎంబసీ నుంచి రూ.15 వేల నగదు కూడా తీసుకున్నట్లు తెలిపింది.