పర్వతాల శివయ్య సన్నిధిలో ఎర్రబెల్లి, అరూరి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల గుట్ట శివయ్యను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, స్థానిక బీఆర్ఎస్ నాయకులు గజమాలతో వారిని సత్కరించారు.
ఈ సందర్బంగా స్వామి వారికి మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్వతాల శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి, ఎమ్మెల్యేకు స్వామి వారి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.