సికింద్రాబాద్ లో అగ్గి రాజేసిన అగ్నిపథ్

సికింద్రాబాద్ లో అగ్గి రాజేసిన అగ్నిపథ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్మీ పరీక్ష కోసం వచ్చిన యువకులు ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.సికింద్రాబాద్ లో అగ్గి రాజేసిన అగ్నిపథ్కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్ని పథ్ స్కీంను రద్దుచేసి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ యథాతధంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైల్వే ప్లాట్ ఫాం పై యువకులు ఆందోళనకు దిగారు. రైలు పట్టాల మధ్యలో పార్సల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.