శ్రీరాంసాగర్ కు భారీ వరద
వరంగల్ టైమ్స్, నిజామాబాద్ జిల్లా : భారీ వర్షాల కారణంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయంతోకి 2,45,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దీంతో అధికారులు 34 గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగులకు చేరింది.జలాశయంలో 90 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 74.506 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. ప్రస్తుతం 9420 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు నీటినిల్వ 17,284 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.