ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా 

ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం ప్రారంభంకానున్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను రాష్ట్ర సర్కార్ వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (TSCHE)ప్రకటించింది.ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా ఐతే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెల్పింది.