భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ 

భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

వరంగల్ టైమ్స్, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరుగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను జిల్లా కలెక్టర్ అనిరుధ్ ఆదేశించారు. భారీ వరదతో భద్రాద్రి రామాలయం పడమర మెట్ల వద్ద నీరు చేరింది. ఆలయ దుకాణాలు నీటమునిగాయి. అన్నదాన సత్రంలోకి నీరు చేరడంతో ఆలయ అధికారులు నిత్య అన్నదానం నిలిపివేశారు.