విద్యాసంస్థలకు మరో మూడ్రోజులు సెలవులు

విద్యాసంస్థలకు మరో మూడ్రోజులు సెలవులు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.విద్యాసంస్థలకు మరో మూడ్రోజులు సెలవులుఅయితే గత వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభంకానున్నాయి. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.