రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు : సీవీ ఆనంద్‌ 

రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు : సీవీ ఆనంద్‌

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేయనున్నారు. ఆమె తొలిసారి రాష్ట్రానికి వస్తుండడంతో గవర్నర్‌, సీఎం సహా అధికార యంత్రాంగం ఆమెను ఘనంగా స్వాగతించనున్నారు. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక దళం శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. గవర్నర్‌, సీఎం, ఉన్నతాధికారులతో భేటీ అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు.రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు : సీవీ ఆనంద్‌ ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో శనివారం వాహన శ్రేణితో ట్రయల్‌రన్‌ నిర్వహించారు. మేడ్చల్‌ కలెక్టర్‌ డాక్టర్‌.ఎస్‌.హరీశ్‌, ప్రొటోకాల్‌ అదనపు కార్యదర్శి అర్వింద్‌సింగ్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, హకీంపేట విమానాశ్రయం చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి నరేంద్రవర్మ, వింగ్‌ కమాండర్లు చౌదరి, పంకజ్‌జైన్‌లు హకీంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు.

*ఈనెల 26-30 వరకు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ..
రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా పోలీసులు నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.