‘అనుకోని ప్రయాణం’ ఫస్ట్ సింగల్ ఏ కథను లాంచ్

‘అనుకోని ప్రయాణం’ ఫస్ట్ సింగల్ ఏ కథను లాంచ్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. జగన్ మోహన్ డి వై నిర్మాతగా, వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.'అనుకోని ప్రయాణం' ఫస్ట్ సింగల్ ఏ కథను లాంచ్ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ఏకథను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు మధు కిరణ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు.

”ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుందని మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ అన్నారు. సంగీత దర్శకుడు శివ, కోటి గారి దగ్గర తొమ్మిదేళ్ళు పని చేశారు. సంగీత ద్ఫర్శకుడిగా శివ మంచి విజయాలు అందుకోవాలి. పాటకు ఆక్సిజన్ నింపే శంకర్ మహదేవన్ గారు ఈ పాటని చాలా బ్రిలియంట్ గా పాడారు. మధు కిరణ్ ఈ పాట కు మంచి సాహిత్యం అందించారు.

రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటులు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. ఈ చిత్రం కూడా మరో మంచి చిత్రం అవుతుందని నమ్మతున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని తమన్ తెలిపారు.

ప్రేమ,తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ ప్రభాస్ శ్రీను రంగస్థలం మహేష్ ఇతర కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి మల్లికార్జున్ నరగాని డీవోపీగా, శివ దినవహి సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం.

తారాగణం : డాక్టర్ రాజేంద్రప్రసాద్ , నరసింహరాజు, ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ నారాయణరావు , అనంత్ ప్రభాస్ శ్రీను రంగస్థలం మహేష్ . జోగి సోదరులు ధనరాజ్ . కంచరపాలెం కిషోర్ , జెమిని సురేష్ తాగుబోతు రమేష్

సాంకేతిక నిపుణులు :
రచన,దర్శకత్వం : వెంకటేష్ పెదిరెడ్ల
కథ, నిర్మాత : డా.జగన్ మోహన్ డి వై
సమర్పణ : బెక్కం వేణుగోపాల్
డీవోపీ : మల్లికార్జున్ నరగాని
సంగీతం : ఎస్ శివ దినవహి
డైలాగ్స్ : పరుచూరి బ్రదర్స్
ఎడిటర్ : రామ్ తుము
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మణికుమార్ పాత్రుడు
ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ భీమగాని
పీఆర్వో : తేజస్వి సజ్జ