శనివారం హైదరాబాద్ కు రానున్న మోడీ

శనివారం హైదరాబాద్ కు రానున్న మోడీవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఎల్లుండి హైదరాబాద్ కి రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరవడం సహా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్ కు వెళ్తారు. అక్కడ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అవసరమైన బందోబస్తు, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేస్తోంది.