కేసీఆర్ పాలనలో రోడ్లకు మహర్దశ: ఎర్రబెల్లి

కేసీఆర్ పాలనలో రోడ్లకు మహర్దశ: ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ రోడ్ల పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేనంత గా రోడ్లు నిర్మితమవుతున్నాయని, ప్రతీ గ్రామంలో రోడ్లు, గ్రామాల మధ్య లింకు రోడ్లు రావడంతో గ్రామాలన్నీ బాగున్నాయని మంత్రి అన్నారు. పెరికేడు గ్రామంలో నిర్మిస్తున్న రోడ్లను నాణ్యతగా వెయ్యాలని మంత్రి సూచించారు. నిర్ణీత సమయంలో పూర్తి చేసి బిల్లులు పొందాలని అధికారులకు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రోడ్లను బాగు చేసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.