టీమిండియాలో కరోనా కలకలం

టీమిండియాలో కరోనా కలకలం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు ముందు టీమిండియాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. సీనియర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ సహా నలుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ నవ్ దీప్ సైనీకి కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కరోనా నుంచి కోలుకునే వరకు వారు ఐసోలేషన్ లోనే ఉంటారని తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు.టీమిండియాలో కరోనా కలకలంమూడు రోజుల క్వారంటైన్ అనంతరం బుధవారం పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ అని తేలింది. కాగా, వీరితో పాటు సపోర్ట్ స్టాఫ్ లోనూ పలువురికి పాజిటివిగా తేలినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. వీరంతా వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండి, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో రెండు సార్లు నెగెటివ్ వస్తేనే తిరిగి జట్టుతో కలవనున్నారు. కాగా, ఆటగాళ్లు కరోనా బారినపడిన నేపథ్యంలో బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి ఎంపిక చేశారు.