వనదేవతలను దర్శించుకున్న వైఎస్ షర్మిల

వనదేవతలను దర్శించుకున్న వైఎస్ షర్మిలవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు ఆమెకు స్వాగతం పలికి వనదేవతల తీర్థ ప్రసాదాలను అందచేశారు. జిల్లా పార్టీ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.