రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలమే : టీఆర్ఎస్వీ

రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలమే : టీఆర్ఎస్వీవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం తమ నిజాయితీని తప్పిందని టీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ డా. అరూరి రంజిత్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందంటూ టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ డా. అరూరి రమేష్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం వైఖరిని నిరసిస్తూ హనుమకొండ నగరంలోని అదాలత్ లో గల అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ నిరసనలో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. కేంద్రంలో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేవలం తెలంగాణకు పర్యాటకుడిగానే వ్యవహరించారని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ .. ప్రగతి కోసం కాకుండా, కేవలం ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతుందని వారు ధ్వజమెత్తారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా. బొల్లికొండ వీరేందర్, టీఆర్ఎస్వీ జనగామ జిల్లా కోఆర్డినేటర్ మేడారపు సుధాకర్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్, టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సీనియర్ నాయకులు డా.పాలమకుల కొమురయ్య, కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరు, పిన్నింటి విజయ్ కుమార్, టీజేఎస్ ఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్, పస్తం అనిల్ , ప్రణయ్, ప్రసాద్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు…