ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న తలసాని

ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న తలసాని

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఫిబ్రవరి శనివారం హైదరాబాద్ లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు నగరానికి రానున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకనున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధానమంత్రికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకనున్నారు. మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ప్రధాని మోడీ తిరుగుప్రయాణంలోనూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడ్కోలు పలుకనున్నారు.