మోదీ పర్యటనకు భారీ బందోబస్తు: డీజీపీ

మోదీ పర్యటనకు భారీ బందోబస్తు: డీజీపీవరంగల్ టైమ్స్,హైదరాబాద్: రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలోనూ మోడీకి మంత్రి తలసాని వీడ్కోలు పలకనున్నారు.

మరో వైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సమతామూర్తి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. సుమారు 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఒకే చోట నుంచి భద్రతను పర్యవేక్షించేందుకు సమతామూర్తి కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పోలీసులు భద్రత పర్యవేక్షిస్తారని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌కు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక్రిశాట్, ముచ్చింతల్‌, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద భద్రత పెంచామని పేర్కొన్నారు. ఏ ఆటంకాలు లేకుండా ప్రముఖుల పర్యటనకు ప్రణాళికలు రూపొందించామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పస్టం చేశారు.