అభివృద్ధిలో హెచ్​ఎండీఏ కీలకం: కేటీఆర్

అభివృద్ధిలో హెచ్​ఎండీఏ కీలకం: కేటీఆర్వరంగల్ టైమ్స్, హైదరాబాద్​: ఏడు జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్​ఎండిఏ) అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగాలని హెచ్​ఎండీఏ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. మంత్రి కేటీఆర్​ శుక్రవారం తొలిసారిగా అమీర్​ పేట్​ లోని హెచ్​ఎండీఏ కార్యాలయానికి వచ్చారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మెట్రోపాలిటన్​ కమిషనర్​, స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ అర్వింద్​ కుమార్​ హెచ్​ఎండిఏ కార్యాచరణను మంత్రికి వివరించారు.

తదుపరి ఇంజనీరింగ్​, ప్లానింగ్​, అర్బన్​ ఫారెస్ట్రీ వంటి విభాగాల వారీగా మంత్రి కేటీఆర్​ సమీక్షించి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు చేశారు. మంత్రి సమీక్ష సమావేశానికి హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జిసిఎల్​) ఎండి సంతోష్​ ఐఏఎస్​, అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ బి.ప్రభాకర్​ ఐఎఫ్ఎస్​, హెచ్​ఎండీఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, చీఫ్​ ఇంజినీర్​ బి.ఎల్​.ఎన్​.రెడ్డి, ప్లానింగ్​ డైరెక్టర్లు బాలకృష్ణ, శివశరణప్ప, ఎస్టేట్​ ఆఫీసర్​ కె.గంగాధర్​, సీఐఓ హరినాథ్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.