6 నుంచి మంగళగిరి “నరసింహుని” దీక్షలు

6 నుంచి మంగళగిరి "నరసింహుని" దీక్షలువరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా : మంగళగిరి  శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి శ్రీ నరసింహుని మాలాధారణ మండల దీక్షలు ప్రారంభమవుతాయని దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు తెలిపారు. 26వ తేదీన అర్థ మండలదీక్షలు, మార్చి 8వ తేదీన ఏకాదశ దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. మార్చి 19వ తేదీన ఇరుముడులు, గిరిప్రదక్షిణ, పూర్ణాహుతితో దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ స్వామి వారి మాలాధారణ దీక్ష తీసుకునే భక్తులు 6వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాలస్వామి సన్నిధికి భక్తులు పసుపు షర్టు, లుంగీ, టవలు, తులసి, తామర మాలలతో వచ్చి గురుస్వామిచే శ్రీస్వామివారి దీక్షను స్వీకరించాలన్నారు.