నర్సాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

నర్సాపూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఇప్పటి వరకు 145 అక్రమ నిర్మాణాలపై టాస్క్ఫోర్స్ చర్యలునర్సాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

వరంగల్ టైమ్స్, మెదక్ జిల్లా :  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఎ), డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో రెండు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నాయి. 500 చదరపు గజాల విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల(జి + 2) నిర్మాణాలకు అనుమతి తీసుకుని సెల్లార్, గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (జి + త్రీ) నిర్మాణాలు జరిపిన భవనాల పైఅంతస్తుల స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూల్చి వేశాయి. మరో చోట గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల (జి+2) అనుమతులు తీసుకుని, గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (జి+3) నిర్మాణాలు జరిపిన భవనంపై అంతస్తు స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ కూల్చి వేసింది. ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు హెచ్ఎండీఏ పరిధిలో 145 అక్రమ నిర్మాణాలపై టాస్క్ఫోర్స్ సిబ్బంది చర్యలు చేపట్టింది.