అడ్డా ములాఖత్ తో సమస్యలకు చెక్: దాస్యం

అడ్డా ములాఖత్ తో సమస్యలకు చెక్: దాస్యంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అలాగే ప్రజల ఆకాంక్ష మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల సమస్యలను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రజల నుంచి నేరుగా తెలుసుకుంటారు. ప్రతీ శుక్రవారం డివిజన్ ప్రజలతో అడ్డా ములాఖత్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంను నేడు నిర్వహించారు. జీడబ్లూఎంసీ మేయర్, కమిషనర్, ఇతర అధికారుల సమక్షంలో భద్రకాళి దేవస్థానం ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 4, 9, 11, 29 డివిజన్ల ప్రజలతో చీఫ్ విప్ ముఖాముఖి నిర్వహించారు. డివిజన్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ములాఖత్ వేదికగా సంబంధిత అధికారుల సమక్షంలోనే వారి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను దాస్యం అందించారు.అడ్డా ములాఖత్ తో సమస్యలకు చెక్: దాస్యంకొవిడ్ నేపథ్యంలో కొన్ని రోజులు ముఖాముఖి కార్యక్రమంను నిర్వహించలేకపోయినట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.ప్రజలు, నాయకులు, మేధావుల అభిప్రాయం మేరకు నూతన సంవత్సరంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు దాస్యం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శుక్రవారం ముఖాముఖి, శనివారం కాలనీ దర్శన్, ఆదివారం అపార్ట్మెంట్ దర్శన్ వీటితో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అడ్డా ములాఖత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల డివిజన్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నేరుగా తమ సమస్యలు పరిష్కారం జరిగేందుకు ములాఖత్ కార్యక్రమం అద్భుతంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలకు పరిష్కారం చూపిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి డివిజన్ వాసులు ధన్యవాదాలు తెలిపారు.