అసదుద్దీన్ ఓవైసీపై కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్

అసదుద్దీన్ ఓవైసీపై కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్వరంగల్ టైమ్స్, లక్నో : మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా ఢిల్లీ వెళ్తుండగా, హపూర్-ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్ ప్లాజా వద్ద ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఓవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

నిందితుడు బీజేపీ కార్యకర్త..నిందితుల్లో ఒకరైన సచిన్ పండిట్ బీజేపీలో క్రియాశీలక కార్యకర్త. పార్టీ సభ్యత్వానికి సంబంధించిన రిసిప్ట్ ను సచిన్ సోషల్ మీడియాలో ఉంచారు. అందులో దేశ్ భక్త్ సచిన్ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ మహేశ్ శర్మలతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.