కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా

కళ్యాణలక్ష్మి చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లావరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సంక్షేమంలో తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకం మహిళల పేర్లతో ప్రవేశపెట్టి తెలంగాణ ఆడపడుచుల మీద కేసీఆర్ గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారని ఆయన కొనియాడారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు హనుమకొండలోని ఆయన నివాసంలో రూ. 39 లక్షలకు పైగా విలువ చేసే కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. పేదింట ఆడపడుచులకు మేనమామగా అండగా నిలిచి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.100116/- అందచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్న వారిలో సంగెం మండలంలోని చింతలపల్లి, ఎల్లగురు రంగంపేట, గవిచెర్ల, మొండ్రాయి, లోహిత, నల్లబెల్లి, పల్లరుగూడ, నార్లవాయి, తీగరాజుపల్లి, సంగెం గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులున్నారు. చెక్కులు తీసుకున్న అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.