నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదా..

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదా పడింది. ఆ పరీక్షను 6 నుంచి 8 వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాస్తవానికి మార్చి 12న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే నీట్ పీజీ- 2021 కౌన్సిలింగ్ కూడా అదే సమయంలో జరుగనున్న నేపథ్యంలో నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కూడా వినతులు వచ్చాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖా ఈ పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొంది.