ఆ యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా 

ఆ యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు మరో మూడ్రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. దీంతో పలు యూనివర్సిటీల పరిధిల్లో రేపటి నుంచి శనివారం వరకు జరిగే పలు పరీక్షలను వాయిదా వేశారు. గురువారం నుంచి ఈ నెల 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.ఆ యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.