భారీగా సీఐల బదిలీలు

భారీగా సీఐల బదిలీలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న సీఐలను కూడా బదిలీ చేశారు. కొద్ది రోజుల క్రితం పోలీసు కానిస్టేబుల్ బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే.