బప్పిల హరి మృతికి మెగాస్టార్ నివాళులు

బప్పిల హరి మృతికి మెగాస్టార్ నివాళులు

బప్పిల హరి మృతికి మెగాస్టార్ నివాళులువరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రఖ్యాత బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. తన ట్విట్టర్ వేదికగా బప్పి లహిరితో దిగిన ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి దా మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బప్పి లహిరితో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. తన చిత్రాలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను బప్పి అందించినట్లు మెగాస్టార్ గుర్తు చేశారు. బప్పి లహిరి కంపోజ్ చేసిన పాటలతో తన సినిమాలకు మంచి పాపులారిటీ వచ్చినట్లు చిరు తెలిపారు. బప్పి స్టైల్ చాలా విశిష్టంగా ఉంటుందని, జీవితం మీద ఉన్న ఉత్సాహం, ఆయన పాటల్లో కనిపించేదని చిరు తన ట్వీట్ లో తెలిపారు.