మెగాస్టార్ ‘గ్యాంగ్ లీడర్’ మళ్లీ వస్తోంది !

మెగాస్టార్ ‘గ్యాంగ్ లీడర్’ మళ్లీ వస్తోంది !

మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' మళ్లీ వస్తోంది !

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఒకప్పుడు బాక్సీఫీసు షేక్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ మళ్లీ తెరమీదికి రాబోతుంది. ఒకప్పుడు బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టిన సినిమా మళ్లీ మార్చి 4న గ్రాండ్ రీరిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ ఇప్పటికే రీరిలీజ్ మానియా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా 4Kలో కన్వర్ట్ అయి రీరిలీజ్ కు సిద్ధమైంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బప్పిలహరి సంగీతంతో విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా 32 యేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీసు షేక్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’సినిమాను 4Kలో మార్చి 4న రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఒకప్పుడు ‘గ్యాంగ్ లీడర్’సినిమా టికెట్లు దొరకక నిరుత్సాహం చెందిన అభిమానులకు ఈ సినిమా 4K ఫార్మాట్ లో కనువిందు చేయనుంది. బాక్సాఫీసును షేక్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ తన పాత రికార్డులను తిరగరాసి అభిమానులకు పూనకాలు పుట్టిస్తుందో లేదో చూడాలి మరి.