జ్ఞాన సరస్వతికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

జ్ఞాన సరస్వతికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రివరంగల్ టైమ్స్, నిర్మల్ జిల్లా : సకల జ్ఞానాలకు ఆది దైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. శర వేగంగా బాసర దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆల‌య అధికారులు, త‌దితరులు పాల్గొన్నారు.