స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కార్ నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్ లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇవే..
*డీఎంఈ, డీహెచ్ -3,823
*వైద్య విధాన పరిషత్ -757
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ 81
డిజబుల్డ్ , సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ 8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ 127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ 197
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ 74
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ 124
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్ 13