పంచాయతీ బిల్లులు రాక ఉపసర్పంచ్ ఆత్మహత్య 

పంచాయతీ బిల్లులు రాక ఉపసర్పంచ్ ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాటారం మండలం చిదినేపల్లిలో ఉపసర్పంచ్ తిరుపతితో కలిసి రూ. 11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, ఇతర పనులు చేశామని సర్పంచి రాజమౌళి తెలిపారు. పంచాయతీ బిల్లులు రాకపోవడంతో తిరుపతి మనస్తాపంతో శనివారం పురుగుల మందు తాగినట్లు సర్పంచ్ చెప్పారు. చికిత్స నిమిత్తం వరంగల్ కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.