పి.నర్సారెడ్డిని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి

పి.నర్సారెడ్డిని పరామర్శించిన ఇంద్రకరణ్ రెడ్డివరంగల్ టైమ్స్, హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ మంత్రి. పి.నర్సారెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో పి. నర్సారెడ్డిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిసారు. నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు.