అమిత్ షా మాటలన్నీ బోగస్ మాటలే : ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హన్మకొండ జిల్లా : అమిత్ షా బోగస్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువు చేశారని దయాకర్ రావు అన్నారు. హనుమకొండ హరిత కాకతీయలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడిమా సమావేశంలో మాట్లాడారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలని మంత్రి దయాకర్ రావు సవాల్ విసిరారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, అసలు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కృషిని పార్లమెంట్ లో కేంద్రం పొగిడిన విషయాన్ని దయాకర్ రావు గుర్తు చేశారు. కేంద్రం కుట్రపూరితంగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో అమిత్ షా పై విమర్శల వర్షం కురిపించారు. పసుపు బోర్డు ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు. కేసీఆర్ ది త్యాగాల కుటుంబమని ఎర్రబెల్లి కొనియాడారు.
అబద్దాల యూనివర్సిటీకి వీసీ అమిత్ షా : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అబద్దాల యూనివర్సిటీకి అమిత్ షా వీసీ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని అన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్యే పెద్ది అన్నారు.
బండి బెగ్గింగ్ రాజకీయం మానుకో : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఇక సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ బీజేపీ బెగ్గింగ్ రాజకీయ చేస్తున్నదని చల్లా ఎద్దేవా చేశారు. పాదయాత్రలో బండి సంజయ్ ప్రజలు నిలదీశారని వెల్లడించారు. సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.డ