పనితీరు బాగుంది కొనసాగించండి : ఎర్రబెల్లి

పనితీరు బాగుంది కొనసాగించండి : ఎర్రబెల్లిములుగు జిల్లా : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొట్లగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ కార్యదర్శినిఈజీఎస్ పనుల్లో ఉండటంతో సర్పంచ్ పనస సమ్మయ్యను పిలిపించుకున్నారు. గ్రామ పంచాయతీ పనులపై ఆరా తీశారు. కార్యాలయాన్ని పరిశీలించారు. మొక్కలు నాటి, పరిశుభ్రంగా ఉండటంతో అభినందించారు.

మంచినీటి ప్లాంట్ ని ఇంకా వినియోగిస్తున్నారా? మిషన్ భగీరథ మంచినీరు వస్తుందా? అని అడిగారు. భగీరథ నీరు వస్తున్నందున వాటినే వాడాలని మంత్రి సూచించారు. గ్రామ పారిశుద్ధ్యం పై కూడా అరా తీశారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడగడంతో సర్పంచ్, తమకు భూముల పట్టాలు ఇవ్వాలని అడిగారు. దీంతో మంత్రి వాటి విషయమై సీఎం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేడారం జాతర ఏర్పాట్ల పై ఉన్నత స్థాయి సమీక్ష కు వెళుతూ మార్గ మధ్యంలో ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మొట్లగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గట్టమ్మ తల్లిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్ తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తదితరులకు ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘనంగా స్వాగతం పలికారు.