ములుగు జిల్లా : గోవిందరావు పేట మండల కేంద్రంలో ని అయ్యప్ప దేవాలయాన్ని ఎండోమెంట్స్ విభాగానికి మార్చడానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. అలాగే గోవిందరావుపేట గ్రామ అభివృద్ది కోసం తగినన్ని నిధులు కూడా మంజూరు చేస్తానని మంత్రి చెప్పారు. మేడారం జాతర ఏర్పాట్ల పై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొని తిరిగి వరంగల్ కు వస్తూ, మంత్రి గోవిందరావు పేట జెడ్పీటీసీ హరిబాబు ఇంటివద్ద కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా మంత్రికి స్థానికంగా చాలా ఏళ్లుగా నిర్మితమై ఉన్న అయ్యప్ప దేవాలయం విషయాన్ని వారు చెప్పారు. దీనికి తన శక్తి మేరకు కృషి చేస్తామన్నారు. అలాగే గోవిందరావు పేట మండలంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లని, ఈ గ్రామ అభివృద్ది కోసం తగినన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దీంతో జెడ్పీటీసీ తో పాటు ఆ గ్రామ సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.