ఈ ఘటనపై బాబు సమాధానం చెప్పాలి: వెల్లంపల్లి

ఈ ఘటనపై బాబు సమాధానం చెప్పాలి: వెల్లంపల్లివిజయవాడ : లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విజయవాడ బాలిక మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ లోని అపార్ట్మెంట్ కు బాలిక మృతదేహాన్ని తీసుకొచ్చారు. బాలిక మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నరుమున్నీరుగా విలపించారు. ఈ కేసులో నిందితుడు వినోద్ జైనును తక్షణమే కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. బాలిక ఆత్మహత్య ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని పార్థీవదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ ఘటనపై బాబు సమాధానం చెప్పాలి: వెల్లంపల్లివిద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత వినోద్ జైన్ కు తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఈ ఘటనపై పోలీసులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇక ఈ దుశ్చర్యకు పాల్పడిన వినోద్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై చంద్రబాబునాయుడు స్పందించి వినోద్ జైన్ కు తగిన శిక్ష పడేలా చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇక జగన్ సర్కార్ వినోద్ జైన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని, కఠినంగా శిక్షించి, దుర్గమ్య కుటుంబానికి న్యాయం చేస్తుందని మంత్రి తెలిపాడు.