అన్న చేతిలో తమ్ముడు హత్య 

అన్న చేతిలో తమ్ముడు హత్య

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురి అయిన ఘటన మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పొందుగల రోడ్డులో నివాసం ఉండే కృష్ణవరపు ప్రస్సన్నకుమార్, కరుణ కుమార్ అని అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. తమ్ముడు కరుణ కుమార్ తల్లి పై దాడి చేయటంతో చూసిన అన్న చాకుతో తమ్ముడిని పొడిచాడు.

దీనిని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు తమ్ముడు అయిన కరుణ కుమార్ ను వెంటనే మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు తెలిపారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న మైలవరం పోలీసులు హత్య చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.