రైలు కిందపడి టీచర్ ఆత్మహత్య
వరంగల్ టైమ్స్, పశ్చిమగోదావరి జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి.శ్రీనివాసరావు (47) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. నిడదవోలు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైలు పట్టాలపై శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. నాడు- నేడు పనుల్లో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య కు పాల్పడినట్లు సమాచారం.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.