విలేకరిపై కాల్పులు..ఆసుపత్రికి తరలింపు

విలేకరిపై కాల్పులు..ఆసుపత్రికి తరలింపు

విలేకరిపై కాల్పులు..ఆసుపత్రికి తరలింపు

వరంగల్ టైమ్స్, అమరావతి : అన్నమయ్య జిల్లా రాయచోటి శివాలయం కూడలి వద్ద ఓ టీవీ ఛానల్ విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పీలేరులో పనిచేస్తున్న పర్వ తరెడ్డి (45) గత నెల 31 సాయంత్రం 5.30కు చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి బయలుదేరి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే టైంలో శివాలయం కూడలి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో విలేకరి గాయపడినట్లు పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

వాహనాల టైర్ల కిందినుంచి రాయి వచ్చి తగిలిందని భావించి కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారన్నారు. వైద్యులు శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ ను వెలికి తీశారన్నారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి. కాల్పులు జరిపినవారి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. క్షతగాత్రుడికి, వారి బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.