పద్మశ్రీ మొగులయ్యను కలిసిన బండి సంజయ్

పద్మశ్రీ మొగులయ్యను కలిసిన బండి సంజయ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగలయ్యను బీజేపీ రాష్ట్ర అద్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు. సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీలో చిన్న పెంకుటింట్లో నివాసం ఉంటున్న మొగిలయ్య ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మొగులయ్య ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పద్మశ్రీ మొగులయ్యకు బండి సంజయ్ సన్మానం చేశారు.

కిన్నెర వాయిద్యంలో మొగులయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. బండి సంజయ్ తో పాటు జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి మొగులయ్య నివాసానికి చేరుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి మొగులయ్యకు ప్రత్యేక ఆశీస్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ప్రముఖ వైద్యులు, అడ్వకేట్లు మొగులయ్య నివాసానికి చేరుకుని మొగులయ్యను శుభాకాంక్షలు తెలిపారు.