మోడీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో : కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు ప్రధాని మోడీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమోనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కిన సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను రాసిన చంద్రబోస్ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కొణతం దిలీప్ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుందాం అని ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అయితే కొణతం దిలీప్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నాటు నాటు పాటకు ప్రధాని మోడీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమోనని కేటీఆర్ పేర్కొన్నారు.