నాగబాబు వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్‌

నాగబాబు వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్‌

నాగబాబు వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్‌

వరంగల్ టైమ్స్ , అమరావతి : తన శాఖ అభివృద్ధి గురించి సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. నాగబాబు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ ఆమె ట్వీట్‌ చేశారు. “విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలి. నోటికి ఎంత వస్తే అంత వాగడం సరికాదు. ఫేక్‌ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం మీకే చెల్లుతుంది. ఏపీ గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు” అని రోజా పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందంటూ రోజాపై నాగబాబు విమర్శలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడమని మంత్రి తెలుసుకోవాలన్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు..” అని నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.