నా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి

నా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి

వరంగల్ టైమ్స్, నెల్లూరు : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇబ్బందిపడతారని, నా దగ్గరున్న ఆధారాలు ఇస్తే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ఓ పోలీస్ అధికారి తెలిపారని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్‌పై తన దగ్గర ఉన్న పక్కా ఆధారాలను మీడియాకు విడుదల చేశారు.ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగతనంగా తన కాల్స్ వింటున్నారని, సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండా ట్యాపింగ్ జరగదని ఆరోపించారు. తాను ఫ్రెండ్‌తో మాట్లాడిన మాటల్ని ట్యాప్ చేశారన్నారు.అయితే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.నా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించిన కోటంరెడ్డి

కోటం రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేర్వేరు అన్నారు.థర్డ్ పార్టీ రికార్డింగ్ చేస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి.? పార్టీ మారాలని అనుకుంటే వెళ్లొచ్చు, కానీ నిందలు వేయడం సరైన విధానం కాదని నా అభిప్రాయం. విశాఖ పట్టణం రాష్ట్ర భవిష్యత్తుకు వేదిక కానుంది.మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, G-20 సదస్సులు చాలా కీలకం అన్నారు.కొత్త బిల్లు పెట్టి విశాఖకు రాజధాని తీసుకుని వస్తాం అని స్పష్టం చేశారు. రాజధాని విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని స్వయంగా సీఎం ప్రకటించిన తర్వాత దానిపై కొత్త చర్చ అనవసరం అన్నారు. రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసర మైన వర్క్ ఫోర్, పారిశ్రామిక కారిడార్లలో సుమారు 50వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. పార్టీ మారాలని వుంటే మారవచ్చు కానీ, ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి అమర్నాథ్.