ఐదోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ పై ఆమె ప్రసంగించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని 87 నిమిషాల్లోనే ముగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 1, 2020లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అప్పట్లో 162 నిమిషాల పాటు ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనదిగా రికార్డులకెక్కింది.
2019లో నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా పార్లమెంట్ లో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె 2 గంటల 17 నిమాషాలు ప్రసంగించారు. ఆ తర్వాతి నుంచి ఆమె బడ్జెట్ ప్రసంగం నిడివి క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఈ సారి అతి తక్కువగా 87 నిమిషాల్లో ముగించి మరోమారు రికార్డులకెక్కారు. కాగా, కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి కావడం విశేషం.