మహిళలకు కొత్త స్కీమ్..‘సమ్మాన్ బచత్ పత్ర’
వరంగల్ టైమ్స్, దిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5% స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా ₹2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. మధ్యతరగతి ప్రజలు టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లేందుకు దర్శన్ స్కీమ్ తీసుకురానున్నారు. దేఖో అప్నా దేశ్ పేరిట మధ్యతరగతికి పర్యాటక పథకం తీసుకొస్తున్నట్లు నిర్మల తెలిపారు. సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ పరిమితి ₹15లక్షల నుంచి ₹30 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు.