తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం

తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణలో బడిగంటలు మోగాయి. కరోనా నేపథ్యంలో 17 నెలల తర్వాత స్కూల్స్ పున:ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్ కు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. మాస్కులు ధరించిన విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. కొన్ని చోట్ల పాఠశాలల సిబ్బంది విద్యార్థులను శానిటైజ్ చేశారు. 15 నెలలుగా పాఠశాలలకు దూరంగా ఉన్న పిల్లలకు ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సందడితో ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకుంది.తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభంఈ క్రమంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యలో విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా పాఠశాలలను అధికారులు చాలా బాగా శుభ్రం చేయించారని గవర్నర్ తెలిపారు. విద్యార్థులు సంతోషంగా, ధైర్యంగా స్కూలుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు విద్యార్థులను పాఠశాలలకు పంపించిన వారి తల్లిదండ్రులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. కొవిడ్ ను నియంత్రించడంలో భాగంగా మాస్కు ధరించడంపై విద్యార్థులకు అవగాహన ఉందని తెలిపారు. విద్యార్థులకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.