ఛీఫ్ అండ్ బెస్ట్ గోల్డ్ మోసం ముఠా గుట్టురట్టు
వరంగల్ టైమ్స్, కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లాలో కొత్త తరహా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఛీఫ్ అండ్ బెస్ట్ గోల్డ్ మోసం ముఠా గుట్టురట్టైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో కొత్త తరహా బంగారు మోసం కలకలం రేపుతుంది. తక్కువ ధరకు మేలిమి బంగారం ఇస్తామని నమ్మబలికిన దుంగడులు 10వేల రూపాయలు తీసుకుని నకిలీ బంగారం ముక్కలు ఇచ్చి పరారయ్యారు. దీంతో బాధితులు మూలపేటకు చెందిన వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు..నకిలీ గోల్డ్ ముఠా గుట్టురట్టు చేశారు.
సత్తెనపల్లి చీటింగ్ గ్యాంగ్ లో ఒకరి అదుపులోకి తీసుకొని మరో ఇద్దరు కోసం గలిస్తున్నారు యు.కొత్తపల్లి పోలీసులు. నిందితుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు పోలీసులు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 14రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అతని వద్ద నుండి ఇత్తడిపై బంగారు పూతపూసిన బిస్కెట్, హీరో గ్లామర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి తరహా ఘటనలు జిల్లాలో ఇంకెక్కడైన జరిగాయా అని ఆరా తీస్తున్నారు. నకిలి గోల్డ్ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించిన వారిపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు కాకినాడ జిల్లా పోలీసులు. నకిలీ గోల్డ్ కేటుగాళ్లపై నిఘా పెడతామని స్పష్టం చేశారు.