తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా  

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. ఫిబ్రవరి 3న తెలంగాణ డబ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈనెల 6న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. అలాగే పలు బిల్లు, తీర్మానాలపై చర్చ సాగింది.తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా  సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ హాస్పిటల్స్, గురుకులాలు,అక్షరాస్యత, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, హరితవనాలు, పునరుత్వాదక ఇంధన వనరులు తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు. చివరగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.