మోడీ కంటే మన్మోహనే బెటర్ : కేసీఆర్

మోడీ కంటే మన్మోహనే బెటర్ : కేసీఆర్

మోడీ కంటే మన్మోహనే బెటర్ : కేసీఆర్

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : మోడీ కంటే మన్మోహనే బెటర్ అని అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ తెలంగాణకు రాలేదని, మన మన అదృష్టం బాగుందని ఆయన అన్నారు. మోడీ పాలనాతీరు పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ కంటే మోడీ పాలనలోనే దేశం ఎక్కువగా నష్టపోయిందని, పార్లమెంట్‌లో మోడీ స్పీచ్ అధ్వాన్నంగా వుందని కేసీఆర్ చురకలంటించారు.

అదానీ రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చిందని, ఇంత గొడవ జరుగుతున్నా అదానీ గురించి ప్రధాని మాట్లాడకపోవడం సిగ్గుచేటని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ ఆస్తి కరిగిపోయిందని, ఆయన సంస్థలు ఉంటాయో, పోతాయోనని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని,అదృష్టం బాగుండి మన దగ్గర అదానీ కంపెనీ రాలేదన్నారు.