మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర షెడ్యూల్

మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర షెడ్యూల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కామ్రేడ్ మల్లు స్వరాజ్యం పార్థీవ దేహానికి నేడు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి హైదరాబాద్ లోని చార్మినార్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మాకినేని బసవపున్నయ్య భవన్ లో ప్రజల సందర్శనార్థం మల్లు స్వరాజ్యం పార్థీవ దేహాన్ని 9.30 గంటల వరకు ఉంచుతారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 11.30 గంటల వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయానికి ఆమె పార్థీవ దేహం చేరుకుంటుంది. నల్లగొండ జిల్లా సీపీఎం కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంచుతారు.మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర షెడ్యూల్సీపీఎం కార్యాలయం నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా ర్యాలీగా అంతిమయాత్ర మొదలై ప్రకాశం బజార్, ఆర్.పి రోడ్ మీదుగా పెద్దగడియారం సెంటర్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. పెద్ద గడియారం సెంటర్లో 2.30 నుండి 3.30 గంటల వరకు సంతాప సమావేశం జరుగుతుంది. ఇందులో ముఖ్యులు పాల్గొననున్నారు. సరిగ్గా 3.30 గంటలకు పెద్ద గడియారం నుండి పార్థివ దేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలిస్తారు. ఆ తర్వాత 3.45 నిమిషాలకు దివంగత మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.