మార్చి 17న టీఎస్ సెట్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : టీఎస్ సెట్-2022 పరీక్షను తిరిగి ఈ నెల 17న నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ మంగళవారం వెల్లడించారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో 13న నిర్వహించాల్సిన సెట్ పరీక్షను 17న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.